మోడీ దెబ్బకు వణికిపోతోందంట..!

Saturday, September 17th, 2016, 04:11:20 PM IST

pak
బలూచిస్తాన్ ప్రజల సమస్యలపై మోడీ మాట్లాడినప్పటి నుంచి పాకిస్థాన్ భయపడింది అంటున్నారు ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ లో బలూచ్ ప్రతినిధి మెహ్రాన్ మర్రి అన్నారు. బలూచ్ ప్రజలను పాకిస్థాన్ ప్రభుత్వం అణచి వేస్తోందని మోడీ ప్రస్తావించినప్పటి నుంచి పాక్ భయపడిపోతోందని ఆయన అన్నారు.నరేంద్ర మోడీ వలన పాక్ సైన్యం,ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు.

ఇటీవల బలూచ్ లో పాక్ సైనిక కార్యకలాపాలు పెరిగాయని అన్నారు.బలూచ్ సమస్యలపై మాట్లాడిన మోడీకి, భారత దేశానికీ ఈ సందర్భంగా బలూచ్ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.పాక్ ఏజెన్సీలు, దాని సైన్యం బలూచిస్తాన్ లో ఎలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారో అమెరికాకు తెలుసు అని అన్నారు.ఈ సందర్భంగా అమెరికా బలూచిస్తాన్ పై తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు.