అమెరికానే ఉగ్రవాదులను పోషించింది.. పాకిస్తాన్ రివర్స్ కౌంటర్

Thursday, September 28th, 2017, 01:31:31 PM IST

ప్రస్తుత రోజుల్లో దేశాలను భయానికి గురి చేస్తున్న విషయం ఉగ్రవాదం. దాన్ని ఎలాగైనా అంతమొందించాలని అగ్ర రాజ్యాలు కృషి చేస్తున్నా కొన్ని దేశాలు మాత్రం సహకరించడం లేదు. ఇప్పటికే ఈ విషయాన్ని రష్యా – అమెరికా మరియు భారత్ అనేకసార్లు ఐక్యరాజ్య సమితుల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఉగ్రవాదులకు కొన్ని దేశాలు సహాయం చేస్తున్నాయని, పాకిస్తాన్ అయితే ఉగ్రవాద స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది.

రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాకిస్తాన్ పై నిప్పులు చెరిగాడు. ఉగ్రవాద చర్యలను ఆపుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేసింది. అమెరికానే ఎక్కువగా ఉగ్రవాదులను పోషించిందని ఒకప్పుడు వైట్ హౌస్ లో వారికి ఆతిధ్యం కూడా ఇచ్చారని పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా లష్కరేతాయిబా హఫీజ్ సయీద్ ని అమెరికానే పెంచి పోషించిందని ఆరోపించారు. అదే విధంగా వారి పని త్వరలోనే పడతామని తమకు కూడా లష్కరేతాయిబా భారంగా మారిందని తెలిపారు అంతే కాకుండా జైషే మహమ్మద్ లాంటి సంస్థలు కూడా చాలా వరకు ఉన్నాయని వాటిని పాకిస్థాన్ లో లేకుండా చేస్తామని ఆసిఫ్ వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments