పాక్ ప్రధాని ఇరుక్కుపోయాడు..ఇమ్రాన్ ఖాన్ హ్యాపీ..!

Tuesday, November 1st, 2016, 10:01:28 PM IST

pak-pm
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు.పనామా పాత్రల లీక్ లో నవాజ్ షరీఫ్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి.దీనిపై విచారణ జరపాల్సిందిగా పాక్ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.షరీఫ్ కుటుంబ సభ్యులు విదేశాల్లో అనినితో సొమ్ముని దాచుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై పాక్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు అయిన ఇమ్రాన్ ఖాన్ కోర్టులో పిటిషన్ వేసాడు.

దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు షరీఫ్ ను విచారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.దీనిపై ఇమ్రాన్ ఖాన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పుని వెలువరించిందని పేర్కొన్నాడు.ఈ నేపథ్యం లో తానూ చేపట్టదలచిన ఇస్లామాబాద్ ముట్టడిని విరమించుకున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు. సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించినందున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.