యాక్ట‌ర్‌కి బొప్పి! బ‌ట్ట‌త‌ల‌పై వెంట్రుక‌లొస్తాయ‌నుకుంటే!?

Monday, February 5th, 2018, 10:37:51 AM IST

ఓ న‌టుడికి ఘోర ప‌రాభ‌వం. త‌న బ‌ట్ట‌త‌ల‌పై వెంట్రుక‌లు మొలిపిస్తాన‌న్న డాక్ట‌ర్ .. వెంట్రుక‌లు మొలిపించ‌డం మాట అటుంచితే.. త‌న త‌ల‌పై అనూహ్యంగా త‌యారైన‌ ప‌చ్చి పుండు మాన్పేందుకు సైతం సాయ‌ప‌డ‌లేదుట‌. దీంతో లబోదిబోమ‌న్న స‌ద‌రు న‌టుడు ఏకంగా మీడియా ముందుకు వ‌చ్చాడు. వివ‌రాల్లోకి వెళితే..

పాకిస్తానీ న‌టుడు స‌య్య‌ద్‌ సాజిద్ హాస‌న్ ని ఓ వైద్యుడు బ‌ట్ట‌త‌ల‌పై వెంట్రుక‌లు మొలిపిస్తాన‌ని ప‌దే ప‌దే వెంట‌పడ్డాడు. దీంతో అత‌డు స‌ర్జ‌రీకి వెళ్లాడు. స‌ర్జ‌రీ పూర్త‌యింది. అయితే అది ఎలా విక‌టించిందో.. అత‌డి త‌ల‌పై వెంట్రుక‌లు రాలేదు స‌రిక‌దా.. ఆ నెత్తి మొత్తం బొప్పి క‌ట్టింది. ప‌చ్చి పుండు అయ్యింది. అది త‌గ్గ‌క‌పోవ‌డానికి కార‌ణం స‌రైన మెడిసిన్ వాడ‌క‌పోవ‌డ‌మే న‌ట‌. ఇదే విష‌యాన్ని స‌ద‌రు న‌టుడు అంద‌రికీ చెప్పుకుని ల‌బోదిబో మ‌న్నాడు. నా లాంటి త‌ప్పు ఎవ‌రూ చేయొద్ద‌ని సామాజిక మాధ్య‌మాల్లో వీడియో పోస్టులు పెట్టాడు. కంగారు ప‌డ‌కండి .. ఇలాంటి ఫేక్ డాక్ట‌ర్ల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్దు.. ప‌క్కాగా ఎంక్వ‌యిరీ చేశాకే వెళ్లండి అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఒక‌డికి జ్ఞానోద‌యం అయ్యింది. ఇత‌రుల మాటేమిటో?