ప్రేమ కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ యువకుడు అక్కడ బందీ అయ్యాడు

Friday, December 30th, 2016, 11:34:44 AM IST

man-shado
ఈ రోజుల్లో ఒకరిని ఒకరు చేసుకోకుండానే ప్రేమించేసుకుంటున్నారు. ఒకవేళ చూసుకున్నా కేవలం ఆన్ లైన్ లో చూసుకుని ప్రేమించేసుకుంటున్నారు. తరువాత వాళ్ళు చేసిన పనికి బాధ పడుతున్నారు. ముంబైకి చెందిన ఫౌజియా అన్సారీ, నెహాల్ అన్సారీల దంపతులు చెప్పినదానిని బట్టి… 2012లో ఆఫ్గనిస్తాన్ వెళ్లిన హమీద్ అన్సారీ (31).. అటునుండి అటు పాకిస్థాన్ లోకి అక్రమంగా ప్రవేశించాడు. అక్కడి సైనికుల చేతికి హమీద్ చిక్కడంతో పాక్ సైనిక కోర్ట్ మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

నవంబర్ 10, 2012 న తమతో హమీద్ మాట్లాడాడని అంటున్నారు. తాను ఆన్ లైన్ లో ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. మూడు సంవత్సరాల శిక్షా కాలం పూర్తి అయిందని నవంబర్ 12న ముంబయి వస్తానని కూడా చెప్పాడు. కానీ ఇంకా రాలేదని, తాము పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి లేఖ రాశామని కానీ అక్కడి నుండి సమాధానం లేదని, ఇంక తమకు ప్రధాని మోడీనే దిక్కు అని, ఆయనకు వినతిపత్రం అందజేయాలనుకుంటున్నట్టు చెప్పారు

  •  
  •  
  •  
  •  

Comments