ప‌న్నీర్‌పై బాంబ్ ఎటాక్‌కి తెగ‌బ‌డే ప్లాన్?

Tuesday, February 14th, 2017, 07:10:26 PM IST


త‌మిళ రాజ‌కీయం అంత‌కంత‌కు వేడెక్కిపోతోంది. చిన్న‌మ్మ శ‌శిక‌ళ దోషిత్వం నిరూప‌ణ అయ్యింది. దాంతో సీఎం గిరీకి ఛాన్సే లేకుండా పోయింది. ప‌ళ‌నిసెల్వంని శ‌శిక‌ళ వ‌ర్గం సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి కొత్త వ్యూహం ర‌చించింది. దీంతో ప్ర‌స్తుతం త‌మిళ‌రాజ‌కీయం ర‌క్తి క‌డుతోంది. అవ్వాల్సిన వాళ్లు సీఎం అవ్వ‌లేదు. కోర్టు తీర్పు రూపంలో పెద్ద దెబ్బ ప‌డింది. అయితే ఇప్ప‌టికీ శ‌శిక‌ళ వ‌ర్గానికే బ‌లం ఎక్కువ ఉంద‌న్న ఊహాగానాలున్నాయి. అందుకే గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు శ‌శిక‌ళ నిల‌బెట్టిన ప‌ళ‌ని సెల్వంకే మొద‌టి అపాయింట్‌మెంట్ ఇచ్చి, అస‌లు ప‌న్నీర్ సెల్వం వ‌ర్గానికి ఎలాంటి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. అయినా ప‌న్నీర్ ప‌ట్టుబ‌ట్టి గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసేందుకు బ‌య‌ల్దేరారు.

అయితే ప‌న్నీర్‌పై ఎలాంటి స‌న్నివేశంలో అయినా దాడులు జ‌రిగే ఛాన్సుంది. శ‌శిక‌ళ వ‌ర్గం అత‌డిపై ఎటాక్‌కి దిగే ఛాన్సుంది. తాజాగా కోర్టు తీర్పు నేప‌థ్యంలో ప‌న్నీర్ వ‌ర్గాన్ని ఎటాక్ చేసే ఛాన్సుంద‌ని డీజీపీ ప్ర‌క‌టించారు. అంటే పొలిటిక‌ల్ హీట్‌లో రౌడీయిజం చేసే ఛాన్సుంద‌ని దీన‌ర్థం. ప‌న్నీర్‌పై బాంబ్ దాడుల‌కు పాల్ప‌డినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది? అంటే శ‌శిక‌ళ శిబిరాన్ని చెల్లా చెదురు చేసేందుకు ప‌న్నీర్ ఎంత‌క‌యినా తెగ‌బ‌డే ఛాన్సుందిప్పుడు. అందుకే ఈ ఎటాక్ జ‌రిగే ఛాన్సుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. అస‌లు ఏం జ‌ర‌గ‌బోతోందో జ‌స్ట్ వెయిట్‌.