కరోనా వైరస్ కి కారణం ఈ జంతువే– తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు!

Saturday, February 8th, 2020, 10:18:51 AM IST


కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. చైనాలో ఇప్పటివరకు ఈ వైరస్ వలన దాదాపు 724 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ వ్యాధి ఇప్పటివరకు 34,546 మందికి సోకినట్లు రికార్డులు నమోదయ్యాయి. చైనా లో శుక్రవారం ఒక్కరోజే ఈ వైరస్ వలన 88 మంది మరణించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి తాజాగా 1540 మంది వైరస్ బారిన పడిన వారు చికిత్స అందుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తుంది. అయితే చైనా ప్రభుత్వం దీనిని అరికట్టేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. అయితే కరోనా వైరస్ ఫై ప్రజలని అప్రమత్తం చేసిన డాక్టర్ లీ వెన్లియాంగ్ ఇదే వైరస్ బారిన పడి మరణించినట్లు వైద్యులు తెలిపారు.

అయితే ప్రస్తుతం ఈ వైరస్ పుట్టుక ఫై వైద్యులు, శాస్త్రవేత్తలు చాల విధాలుగా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు గబ్బిలాలు, పాములు మాత్రమే కరోనా వైరస్ కి కారణమని కొందరు అబిప్రాయపడ్డారు. కానీ తాజాగా ఈ వైరస్ కి కారణం పాంగోలీన్ అని ప్రకటించారు. దీని జన్యుక్రమాన్ని తీక్షణంగా పరిశీలించగా దాదాపు 99 శాతం వైరస్ బాధితుల నమూనాలతో పోలి ఉండటంతో శాస్త్రవేత్తలు నిర్దారించారు. ఇప్పటివరకు దాదాపు 1000 జంతువుల నమూనాలు పరిశీలించగా ఇది మాత్రమే సరిపోలిందని తెలుపుతున్నారు శాస్త్రవేత్తలు. కొందరు ఈ విషయాన్నీ కొట్టి పడేస్తున్నారు. అయితే ఈ వైరస్ వలన పలు దేశాలు విమాన సేవలను చైనా కి నిలిపివేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఫై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.