సీన్ రివర్స్..శశికళ వర్గాన్నే పార్టీ నుంచి గెంటేసిన పన్నీర్..!

Friday, February 17th, 2017, 05:03:52 PM IST


పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు..ఇక తమిళనాడులో రాజకీయ సంక్షోభం సమసినట్లే అని అంతా భావించారు. కానీ పన్నీర్ సెల్వం శశికళ వర్గానికి ఊహించని షాక్ ఇచ్చారు. తమదే అసలైన అన్నా డీఎంకే పార్టీ అంటూ శశికళ వర్గాన్ని మొత్తాన్ని పార్టీ నుంచి బహింష్కరించారు. ముఖ్యమంత్రి పళని స్వామితో పాటు అతని మంత్రివర్గంలో ఉన్న సహచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పన్నీర్ వర్గం లో ఉన్న అన్నా డీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ప్రకటించారు.

జైల్లో ఉన్న శశికళని అన్నా డీఎంకే పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్న తామందరిని పార్టీ నుంచి తొలగించే అధికారం శశికళకు లేదని తమదే నిజమైన అన్నా డీఎంకే పార్టీ అని మధుసూదనన్ ప్రకటించడం విశేషం. మెజారిటీ ప్రజాప్రతినిధులు వారి వర్గం లో ఉన్నా కార్యకర్తలు తమవైపు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.తాము శశికళను పార్టీ నుంచి బహిష్కరించామని ఆమె అమ్మకు ఇచ్చిన మాట తప్పారు, పార్టీని అప్రతిష్ట పలు చేసారు అని ఆరోపించారు.