పన్నీర్ కు అనుకూలంగా నిర్ణయం జరిగిపోయిందా..?

Thursday, February 9th, 2017, 06:45:14 PM IST


కొద్ది సేపటి క్రితమే పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం పన్నీర్ సెల్వం సంతోషంగా కనిపించారు. త్వరలో శుభవార్త చెబుతానని అయన అన్నారు. తాను రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను గవర్నర్ కు వివరించారు,. తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అందుకు తన బల నిరూపణకు అవకాశం ఇవ్వవలసిందిగా గవర్నర్ ని పన్నీర్ సెల్వం కోరారు.

అయితే గవర్నర్ శశికళ ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తారా ? లేక బల నిరూపణకు సిద్ధం కమ్మని ఆదేశిస్తారా అనేది ఆసక్తిగా మారింది. శశికళను ఇప్పటికే కోర్టుల్లో కేసులు ఉన్న తరుణంలో త్వరలో తీర్పు వెలువడనుంది. ఒకవేళ ఆమెకు శిక్ష పడే అవకాశం ఉంటే మళ్లీ ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అవుతుంది. ఈ నేపథ్యం లో తీర్పు వెలువడేంత వరకు వేచి చూడమని శశికళని ఆదేశించే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు.