పన్నీర్ కోసం ప్రాణాలే వదిలేసాడు..!

Sunday, February 19th, 2017, 05:40:24 PM IST


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం కోసం ఓ అభిమాని ప్రాణాలను సైతం వదిలేసాడు. ఇటీవల తమిళ రాజకీయాల్లో జరిగిన పరిణామానాలను బట్టి పన్నీర్ సెల్వంకు అన్యాయం జరిగిందని భావించిన ముసా (37) అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కీల్పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటన జరిగిన అంతరం పన్నీర్ సెల్వం, పాండ్యన్ మరియు ఇతర పన్నీర్ వర్గంలోని వారు అతడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ లక్ష ఆర్ధిక సాయాన్ని అందజేశారు. పెరియ కాంచీపురం ప్రాంతానికి చేయండిన ముసా పెయింటింగ్ వృత్తి చేసేవాడు. ఇటీవల జరిగిన రాజకీయపరిణామాలు తనని కలచి వేశాయని పన్నీర్ సెల్వంకు అన్యాయం జరిగిందని అతడు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.