ప్యారడైజ్ బిర్యానీకి లక్ష రూపాయల జరిమానా – ఎందుకో తెలుసా…?

Friday, October 18th, 2019, 01:12:20 AM IST

హైదరాబాద్ లో బిర్యానీకి ఎంత ప్రాముఖ్యత ఉందొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ అనే పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది బిర్యానీ ఒక్కటే. అలాంటి చికెన్ బార్యని అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్యారడైజ్..! కేవలం హైదరాబాద్ లోనే మాత్రం కాదు, యావత్ దేశంలోనే ఈ ప్యారడైజ్ రెస్టారెంట్ చాలా ఫేమస్. అయితే ఇంతటి చరిత్ర ఉన్నటువంటి ప్యారడైజ్ బిర్యానీ నేడు చిక్కుల్లో పడింది. కాగా ప్యారడైజ్ బిర్యానీలో వెంట్రుకలు రావడం ప్రస్తుతానికి హైదరాబాద్ లో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. కాగా ఒక నగర యువకుడు బిర్యానీ తినడానికాని రెస్టారెంట్ కి వెళ్లగా అందులో తల వెంట్రుకలు ప్రయక్షమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన సదరు వ్యక్తి వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న హెల్త్ అధికారి, ఫుడ్ ఇన్ స్పెక్టర్, శానిటేషన్ అధికారి ప్యారడైజ్ హోటల్‌ కి చేరుకొని తనిఖీలు చేశారు. కాగా కిచెన్‌‌లో అపరిశుభ్రత, వంట సామాగ్రిలో నాణ్యాత లేకపోవడం వంటి కారణాలతో రూ. లక్ష జరిమానాతో పాటు నోటీసులు ఇచ్చారు. అయితే ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పింది లేకపోతె హోటల్ ని సీజ్ చేస్తామని హెచ్చరికలు చేసింది.