వరల్డ్ కప్ విత్ ప్యారడైజ్: బిర్యాని ప్రేమికులకు బిగ్ ఆఫర్..!

Friday, June 7th, 2019, 04:06:22 PM IST

క్రికెట్ అభిమానులకు మరియు బిర్యాని ప్రేమికులకు శుభవార్త. ఈ వరల్డ్ కప్ సందర్భంగా వరల్డ్ కప్ విత్ ప్యారడైజ్ అంటూ వినూత్న ఆఫర్‌తో మీ ముందుకు వచ్చేస్తుంది ప్యారడైజ్. ఇంతకీ ఏంటి ఆ ఆఫర్ అనుకుంటున్నారా. అయితే ప్రపంచకప్‌ 2019 టోర్నీ నేపథ్యంలో క్రికెట్‌ ప్రియులకు ప్యారడైస్ ఓ సరికొత్త గేమ్ ను మీ ముందుకు తీసుకువచ్చింది. ఈ గేమ్ లో విజేతగా నిలిచిన వారికి 52 వారాల పాటు బిర్యానినీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.

అయితే వరల్డ్‌కప్ విత్ ప్యారడైజ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ గేమ్ ను జూన్ 7 నుంచి జూలై 18 వ తేదీ వ‌ర‌కు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని, పోటీలో ఫ్గెలిచిన విజేతకు ప్రతి వారం బహుమతులు అందచేస్తామని ప్యారడైజ్ సంస్త ఒక ప్రకటనలో తెలిపింది. అయితే క్రికెట్ అభిమానులు మరియు బిర్యానీ ప్రేమికులు ప్యార‌డైజ్ ఫుడ్ కోర్టుల మరియు ఎక్స్‌ప్రెస్ ఔట్‌లెట్‌ల దగ్గ్రకు వచ్చి ఈ పోటీ వివరాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చని తెలిపింది. అయితే ప్రస్తుతం క్రికెట్ ఆటను చూడడానికి ఎంతో మంది ఇష్టపడుతున్నారు కాబట్టి వారి కోసం కాస్త వినూత్న పద్ధతులతో తమ బ్రాండ్‌ను మరింత పెంచుకోవాలనే ఆలోచనలో భాగంగా మొన్నటి వరకు జరిగిన ఐపీఎల్‌లో రెగ్యులర్ కస్టమర్లకు ఉచిత బిర్యాని మరియు ఐపీఎల్ టికెట్లను అందించింది. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ జరుగుతున్న నేపద్యంలో ఇలాంటి కొత్త గేమ్ ప్లాన్ చేసి మరోసారి తమ వినియోగదారుల మదిలో నిలిచిపోవాలని చూస్తుంది. ఇంకే ముంది ఈ క్రికెట్ సీజన్‌లో ప్యారడైజ్‌కి వెళ్ళి వరల్డ్ కప్ విత్ ప్యారడైజ్ గేమ్ లో పాల్గొని గెలవండి. ఏడాదిపాటు ఉచితంగా బిర్యాని పొందండి.