వీడియో : అణుబాంబ్‌తో రాజ‌కీయ‌మా?

Sunday, May 13th, 2018, 12:45:29 PM IST

ఆరు అణుబాంబ్‌లు ఒకేసారి విస్పోట‌నం చెందితే ఏం జ‌రుగుతుంది? ఆ విల‌యం ఊహించ‌లేనిది. కొన్ని వంద‌ల వేల కిలోమీట‌ర్ల వ‌ర‌కూ ఆ ప్ర‌భావం ఉంటుంది. భూమండ‌లంపై స‌మ‌స్త ప్రాణికోటి బూడిద అయిపోతుంది. అయితే అలాంటి టాప్ సీక్రెట్ ఒక‌టి శ‌త్రుదేశాల‌కు చిక్కితే స‌న్నివేశం ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. 1998లో భార‌త ప్ర‌భుత్వం అణుబాంబ్‌ల త‌యారీకి ఉప‌క్ర‌మించిన క్ర‌మంలో ఫోక్రాన్‌లోని సైన్స్ ల్యాబ్‌లో ఏం జ‌రిగింది? అన్న ఆస‌క్తిక‌ర క‌థాంశంతో .. నాటి రాజ‌కీయాల్ని ప్ర‌తిబింబిస్తూ తెర‌కెక్కించిన `ప‌ర‌మాణు` ఈనెల 25న రిలీజ‌వుతోంది.

అస‌లు ఫోక్రాన్ సీక్రెట్ మిష‌న్ ఏంటి? అస‌లు అక్క‌డ త‌లెత్తిన ప‌రిణామం ఏంటి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా తెర‌పై చూపించ‌బోతున్నారు. ఆరు అణుబాంబ్‌ల ప్ర‌యోగానికి సంబంధించిన టెస్ట్‌ల వెన‌క ఏం జ‌రిగింది? అన్న సీక్రెట్‌ని ఈ చిత్రంలో రివీల్ చేయ‌నున్నారు. క్రై అర్జ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించింది. జాన్ అబ్ర‌హాం, డ‌యానా పెంటీ, బొమ‌న్ ఇరానీ వంటి భారీ తారాగ‌ణం న‌టించిన ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. తాజాగా రిలీజ్ చేసిన కొత్త ట్రైల‌ర్ మ‌రింత ఉత్కంఠ పెంచుతోంది.