ఫోక్రాన్ సీక్రెట్స్ లీక్ చేస్తున్న మూవీ

Wednesday, April 25th, 2018, 10:04:35 PM IST

రియ‌ల్ ఇన్సిడెంట్స్‌తో సినిమా తీస్తే అది ఎలాంటి వివాదాల‌కు అయినా తావిచ్చే ఆస్కారం ఉంటుంది. దేశ రాజ‌కీయాలు, అందునా కీల‌క‌మైన అణు ప‌రీక్ష‌ల విష‌యంలో రాజ‌కీయాలు చేస్తే ఎలా ఉంటుందో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిపేలా సినిమా తీస్తే అది ఎలాంటి ప‌రిణామానికి అయినా దారి తీయొచ్చు. ఫోక్రాన్ నేప‌థ్యం, ఇండియా రాజ‌కీయాల నేప‌థ్యంలో సినిమా తీస్తున్నాం అని ప్ర‌క‌టించ‌గానే అంద‌రిలో ఒక‌టే సందేహం. `ప‌ర‌మాణు` అనే టైటిల్ ప్ర‌క‌టించ‌గానే ఎన్నో సందేహాలు క‌లిగాయి. జాన్ అబ్ర‌హాం క‌థానాయ‌కుడిగా క్రై అర్జ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్రేర‌ణ అరోరా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాకి ప్రేర‌ణ‌తో క‌లిసి జాన్ అబ్ర‌హాం స‌హ‌నిర్మాత‌గా కొన‌సాగారు. అయితే ఆన్ లొకేష‌న్ ఉండ‌గానే ప‌లు వివాదాల వ‌ల్ల అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంది. ఇటీవ‌లే ప్రేర‌ణ అరోరాతో జాన్ అబ్ర‌హాం గొడ‌వ‌ప‌డ‌డం ప్ర‌ధానంగా వార్త‌ల‌కెక్కింది. ఆ క్ర‌మంలోనే అస‌లు ఈ సినిమా రిలీజ‌వుతుందా? అవ్వ‌దా? అన్న సందేహం ఏర్ప‌డింది. పారితోషికం విష‌యంలో జాన్ తో ప్రేర‌ణ గొడ‌వ‌ప‌డ్డారు. మొత్తానికి ఈ వివాదం స‌మ‌సిపోయింది. మే 25న మూవీ రిలీజ‌వుతోంది. జాన్ అబ్ర‌హాం- డ‌య‌నా పెంటి, బొమ‌న్ ఇరానీ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సెటిల్‌మెంట్ అనంత‌రం రిలీజ్ పోస్ట‌ర్‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్‌లో రిలీజ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments