కిలాడీ స‌ర‌స‌న ప‌రిణీతికి క్రేజీ ఆఫ‌ర్‌

Thursday, January 11th, 2018, 11:03:08 PM IST

కిలాడీ అక్ష‌య్ కుమార్ సక్సెస్ రేటు అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ, త‌రుగుద‌ల లేనేలేదు. పైగా అత‌డు ఖాన్‌ల‌కు భిన్నంగా వెళుతూ వాళ్ల‌కంటే ఎక్కువ మార్కులే కొట్టేస్తున్నాడు. క‌మ‌ర్షియాలిటీ విత్ సోష‌ల్ మెసేజ్ అన్న ఫార్ములాతో అక్ష‌య్ పెద్ద స‌క్సెస‌వుతున్నాడు. ఓవైపు మంచి సామాజిక సందేశం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొడుతున్నాడు. ఆ కోవ‌లోనే ఇటీవ‌ల అత‌డు న‌టించిన `టాయ్‌లెట్‌-ఏక్ ప్రేమ్‌క‌థ‌` పెద్ద స‌క్సెసైంది. స్వ‌చ్ఛ‌భార‌త్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించిన ఈ సినిమా బిల్ గేట్స్ అంత‌టివాడినే మెప్పించింది.

ఇక లేటెస్టుగా అక్కీ న‌టిస్తున్న `ప్యాడ్ మ్యాన్‌` ట్రైల‌ర్‌తోనే ఎగ్జ‌యిట్‌మెంట్ పెంచింది. ఈ సినిమాతో మ‌హిళామ‌ణుల మ‌నసు దోచేయ‌బోతున్నాడు మ‌రోసారి. ఆడ‌వారికి ప్యాడ్స్ అవ‌స‌రాన్ని, వాటిని అందించాల్సిన ప్ర‌భుత్వ ఆవ‌శ్య‌కత‌ను కూడా చెప్ప‌బోతున్నాడు. ఇదంతా ఇలా ఉంటే అక్ష‌య్ కి సంబంధించి మ‌రో క్రేజీ ప్రాజెక్టు గురించి బాలీవుడ్‌లో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా టైటిల్ కేస‌రి. మూవీ ఫ‌స్ట్‌లుక్ ఇప్ప‌టికే రిలీజై క్రేజు పెంచింది. అనురాగ్ సిన్హా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకి కిలాడీ, క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా పెట్టుబ‌డులు పెడుతున్నారు. 2018-19 మోస్ట్ అవైటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌రిణీతి క‌థానాయిక‌గా ఎంపికైంది. 2019 హోలీ కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. బాలీవుడ్లోనే ది బెస్ట్ హీరో స‌ర‌స‌న ప‌రిణీతి అవ‌కాశం అందుకోవ‌డంపై ప్ర‌స్తుతం హాట్ హాట్‌గా చ‌ర్చ సాగుతోంది.