సీఎం జగన్‌కు మూడు సూటి ప్రశ్నలు సంధించిన పరిపూర్ణనంద స్వామి..!

Friday, April 9th, 2021, 03:32:10 AM IST


ఏపీ సీఎం జగన్‌కు పరిపూర్ణనంద స్వామి మూడు సూటి ప్రశ్నలను సంధించారు. అధికారంలోకి రావడానికి తిరుమలను వివాదంలోకి లాగటం కొంతమంది రాజకీయ నేతలకు అలవాటుగా మారిందని అని మాట్లాడిన పరిపూర్ణనంద స్వామి సీఎం జగన్ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి తిరుపతి ప్రచారానికి రావాలన్నారు. టీటీడీని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌లోకి ఎందుకు తీసుకురాలేదని, తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయ వివాదం నేపథ్యంలో 25 సంవత్సరాలు టీటీడీ ఆస్తుల క్రయ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, గత ప్రభుత్వం 250 ఆలయాలను, ఈ ప్రభుత్వం 350 ఆలయాలను కూల్చిందని దీనిపై సీఎం జగన్ స్పందించాలన్నారు.

అయితే జగన్ ఖచ్చితంగా క్రైస్తవుడే. ఎందుకంటే హిందూ సమాజానికి మంచి చేస్తున్నానని చెప్పి మౌనం పాటించడం తగదని పరిపూర్ణనంద స్వామి అన్నారు. రమణదీక్షితులు సీఎం జగన్‌ను విష్ణువుతో పోల్చడాన్ని ఖండించాలని ఇలాంటివి ప్రోత్సహించిన వారు కాలగర్భంలో కలిసిపోయారని పరిపూర్ణనంద అన్నారు. జగన్‌ను విష్ణువు అని చెప్పి అభిషేకాలు చేసి కిరీటం పెడతారా అని ప్రశ్నించారు. ఇకపోతే రాయలసీమ వెనుక బాటుతనం ఆలోచన లోపంవల్ల జరుగుతోందని అన్నారు.