దెబ్బలు తింటూ కూడా ఫాన్స్ గురించి ఆలోచించిన చిరంజీవి !

Tuesday, October 17th, 2017, 11:36:17 PM IST

తెలుగు చలన చిత్ర రంగంలో మెగాస్టార్ స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.150 చిత్రాలు పూర్తయినా మెగాస్టార్ తన మెస్మరైజ్ నటనతో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ సినిమాకు రచయితలంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది పరుచూరి బ్రదర్సే. దాదాపు 15 ఏళ్ల క్రితం విడుదలైన మెగాస్టార్ ఇంద్ర చిత్రం గురించి పరుచూరి గోపాల కృష్ణ గుర్తుకు చేసుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా అప్పటికప్పుడు ఓ అద్భుతమైన డైలాగ్ రాశామని గోపాల కృష్ణ గుర్తుకు చేసుకున్నారు.

ఇంద్ర చిత్రంలో మేనల్లుడు చేసిన పని వలన చిరు.. నన్ను కొట్టండి.. వాడిని పెంచింది నేనే అని దెబ్బలు తింటారు. అలా దెబ్బలు తిని నేను సైలంట్ గా వచ్చేయడం వలన నా అభిమానులు బాధపడతారు. ఆ సన్నివేశంలో ఏదైనా మంచి డైలాగ్ పడాలి అని చిరు మాకు షూటింగ్ స్పాట్ నుంచి ఫోన్ చేశారు. ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తాను సార్ అన్నాను. లేదు నేనే చేస్తా అని చిరు అన్నారు. సరిగ్గా ఐదునిమిషాలు తరువాత ఫోన్ వచ్చింది. ‘తప్పు నావైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళుతున్నాను.. లేకపోతే తలలు తీసుకుని వెళ్లేవాడిని’ అనే డైలాగ్ చెప్పగానే చిరంజీవి చాలా సంతోష పడ్డారు. మీరు దగ్గర ఉంటే కౌగిలించుకునేవాడిని అని చిరు ఫోన్ లో తెలిపినట్లు పరుచూరి గుర్తు చేసుకున్నారు. పరుచూరి పలుకులు పేరుతో వీడియో ద్వారా గోపాల కృష్ణ ఈ విషయాలని వెల్లడించారు.

  •  
  •  
  •  
  •  

Comments