బిగ్ బాస్ షో పై పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు ?

Saturday, September 15th, 2018, 10:06:27 AM IST

ప్రస్తుతం మా టివిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 2 సీజన్ పై పలు విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువు సంచలన కామెంట్స్ చేసారు .. మరో వైపు ఈ షో పై కేసు కూడా వేశారు. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ 2 లో జరిగి కొన్ని సంఘటనలను నేను జీర్ణించుకోలేకపోతున్నానని ఈ షో లో పెట్టె పలు గేమ్ షో లు దారుణంగా ఉంటున్నాయని, మగవాళ్లకు , ఆడవాళ్లకు ఒకేలా పోటీలు పెట్టడం దారుణమని మగవాళ్లకు ఉన్న బలం ఆడవాళ్లకు ఉంటుందా అంటూ ఘాటుగా స్పందించారు. ఈ మద్యే ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలను కార్ లో పెట్టి .. ఇద్దరు మహిళలను బయటికి నెట్టి వేయడం నాకు బాధ కలిగించింది. బలవంతులు బలహీనులపై గెలవడం క్రీడా స్ఫూర్తి కాదని అన్నారు . ఇలాంటి విషయాలు బిగ్ బాస్ టీమ్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అంటూ చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments