దేశంలో 9 లక్షలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో కొత్త కేసులు ఎన్నంటే..!

Tuesday, July 14th, 2020, 11:25:00 AM IST

దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 28,498 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 9 లక్షల మార్క్‌ను దాటింది.

ఇప్పటి వరకు మొత్తం 9,06,752 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే ప్రస్తుతం అందులో 3,11,565 యాక్టివ్ కేసులు ఉండగా, 5,71,460 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే నిన్న ఒక్క రోజే కరోనాతో 553 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 23,727కి పెరిగింది. ఇక దేశంలో మరణాల రేటు 2.6 శాతం ఉండగా, రికవరీ రేటు 63 శాతంగా ఉంది.