పవన్ ఒక మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నా- కత్తి మహేష్

Wednesday, January 10th, 2018, 06:04:57 PM IST

ఈ వార్త కత్తి మహేష్ లోని రియల్ క్రిటిక్ ను ప్రతిబించేలా ఉందని చెప్పవచ్చు. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజే కాబట్టి ఇటువంటి టాక్ ఊహించిందే అని, రెండు మూడు రోజులు గడిస్తే సినిమా గురించిన జెన్యూన్ టాక్ బయటకి వస్తుందని పవన్ ఫాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంచితే, ఇవాళ మార్నింగ్ షో చూసిన కత్తి మహేష్ సినిమా గురించి ట్వీట్ చేశారు. సీరియస్ కధకు కామెడీ జోడించి చికాకు పెట్టించి అపహాస్యం చేశారని ఆయన ట్వీట్ సారాంశం. అయితే తదనంతరం మోజో యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కత్తి మాట్లాడుతూ అజ్ఞాతవాసి టీజర్ లో ఏమి లేదని, అయితే మొన్న విడుదలయిన ట్రైలర్ చూస్తే సినిమాలో మాత్రం విషయం ఉంటుందని ఆశించానని అన్నారు.

ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, కాబట్టే అన్ని విషయాల్ని పక్కన పెట్టి హాయిగా సినిమా చూద్దామని వెళ్లిన తనను పవన్, త్రివిక్రమ్ తీవ్ర నిరుత్సాహ పరిచారని అన్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి, కొడకా కోటేశ్వర రావు పాత తప్ప మిగిలిన అన్ని పాటలు తనకు సినిమాలు నచ్చాయని, పాటల్లో కూడా మంచి బలమైన అర్దాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ నుండి కధా మూలాన్ని తీసుకున్నప్పిటికి అనవసరంగా కామెడీని జొప్పించి చౌకబారు రొమాంటిక్ స్కీన్ లు జత చేసి తెలుగు ప్రేక్షకులకు ఇది సరిపోతుంది అన్నట్లు తీశారని అన్నారు. మంచి కధ కు సరైన న్యాయం చేయకపోగా దాని తాలూకు ఫీల్ ని నాశనం చేస్తే ఎవరూ ప్రశంసించారని అన్నారు .చివరిగా పవన్ పూర్తి స్థాయి రాజకీయాల లోకి వెళ్లే ముందు ఒక మంచి సినిమా చేయాలని తాను కోరుకుంటున్నట్లు కత్తి మహేష్ చెప్పారు …