ఆ సినిమా ఆడియో ఫంక్షన్కి రానున్న పవన్ కళ్యాణ్!

Friday, May 4th, 2018, 10:28:31 PM IST


రాజా ది గ్రేట్ మూవీ తో మంచి హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ, ఇటీవల విడుదలయిన టచ్ చేసి చూడు తో మరొక భారీ పరాజయాన్ని అందుకున్నారు. కాగా ఆయన తన తదుపరి చిత్రాలను ఆచి తూచి చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు రెడీ అవుతున్న ఆయన లేటెస్ట్ మూవీ నేలటికెట్. సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాయిరిషిక సమర్పణలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. త్వరలో ఆడియో విడుదల కార్యక్రమం జరుపుకోనుంది. కాగా ఈ చిత్ర ఆడియో విడుదలకు ఒక ప్రముఖ హీరో హాజరవుతారని రూమర్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి.

అయితే ఆ సమయంలో పలువురు హీరోల పేర్లు తెరమీదకు వచ్చాయి. కాగా ఆ ప్రత్యేక అతిథి ఎవరు అనేది త్వరలో మాత్రం మేము ప్రకటిస్తాము అని యూనిట్ తెలిపింది. మొత్తానికి నేడు ఈనెల 10వ తేదీన ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక జరగనుందని, ఆ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచేస్తున్నారని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు చిత్ర యూనిట్. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది…..

  •  
  •  
  •  
  •  

Comments