పవన్ సినిమాలు చేస్తాడు.. కానీ?

Saturday, March 24th, 2018, 11:12:00 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా రెగ్యులర్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే అజ్ఞాతవాసి సినిమా అయిపోయిందో పవన్ సినిమాల గురించి ఆలోచించడం మానేశాడు. అందులోను ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు కూడా బాగాలేవు. ఈ సమయంలో అసలు అటు వైపు కూడా చూడట్లేదు, ఇంతకుముందు సినిమాలు చేస్తాను అని చెప్పిన దర్శక నిర్మాతలకు పవన్ ఇప్పుడు కుదరదని డైరెక్ట్ చెప్పేశాడట. అంతే కాకుండా అడ్వాన్సులు కూడా వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఎదో ఒక విధంగా డబ్బు అవసరం పడుతుంది. యాత్రలకు మీటింగ్ లకు లేదా సభలకు ఎంతో కొంత ఖర్చు లేకుండా ఏ పని కాదు.

అయితే పవన్ ఎక్కువగా ఆస్తులనైతే కూడబెట్టుకోలేదు. ప్రస్తుతం నిర్వహిస్తోన్న సభలు కూడా ఇతరుల సహాయంతో జరుపుతున్నట్లు జనసేన సభలో పవన్ తెలిపాడు. అయితే ఆర్థికంగా కొంచెం స్ట్రాంగ్ ఉండాలని పవన్ సినిమాలను చేయాలనీ అనుకుంటున్నాడు. అంటే హీరోగా కాదు. నిర్మాతగా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే నితిన్ తో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే భారీ బడ్జెట్ సినిమాలు కూడా చేయాలనీ అనుకుంటున్నాడు. అందుకోసం మెగా పవర్ స్టార్ ముందుకు రానున్నట్లు టాక్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పీకే ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయాలనీ అనుకున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. చరణ్ కూడా అందుకు ఒకే అనకుండా ఉండలేడు. మరి ఆ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.