పవన్ కళ్యాణ్ చెప్పిన శాసనం తారుమారయ్యిందిగా..!

Sunday, June 2nd, 2019, 12:01:56 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికల ఫలితాలు గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు రెండు రోజుల క్రితమే జగన్ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ సారి ఎన్నికలలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో నిలిచాయి. అయితే గత ఎన్నికలలో టీడీపీకి మద్ధతు తెలిపిన జనసేన కూడా ఈ సారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలిచింది. అయితే మార్పు కోరి రాజకీయాలలోకి వచ్చానని ఖచ్చితంగా సమాజంలో మార్పు తీసుకొస్తానని ఎన్నికల ముందు పవన్ ఎన్నో మాటలు చెప్పారు.

అయితే ఎన్నికల ముందు నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి మాదే అధికారం అని చెప్పుకొస్తూ వచ్చారు. అంతేకాదు ప్రచారంలో అయితే అధికారంలో ఉన్న టీడీపీ కన్నా వైసీపీ పైనే ఎక్కువ మాటల తూటాలు పేల్చాడు పవన్. అయితే ఒకసారి జగన్ గెలుపుపై జోస్యం కూడా చెప్పాడు. వైసీపీ ఎప్పటికి అధికారంలోకి రాలేదని, జగన్ ఎప్పటికి ఏపీకి ముఖ్యమంత్రి కాలేరని ఇదే శాసనం అని అన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ మాటలు పటాఫంచలయ్యేలా ఏకంగా 151 స్థానాలను వైసీపీ గెలుచుకుని చరిత్రనే సృష్టించింది. అంతేకాదు వేలాది మంది జనసంద్రోహం నడుమ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు. అయితే పవన్ తాను చెప్పిన శాసనం తిరగబడిపోయిందని ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జగన్‌కు చివరకు అభినందనలు తెలిపాడు. ఓడలు బళ్ళు అవుతాయి.. బళ్ళు ఓడలు అవుతాయి అన్న నానుడి ఇప్పటికైనా పవన్‌కి అర్ధమైందని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారట.