ఫస్ట్ డే పవన్ కుమ్మేశాడు.. అజ్ఞాతవాసి రికార్డ్ కలెక్షన్స్!

Thursday, January 11th, 2018, 03:51:45 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆయన అభిమానుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అదే తరహాలో అజ్ఞాతవాసి సినిమాపై కూడా రిలీజ్ కు ముందే ఊహించని విధంగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కడంతో సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. యూఎస్ వంటి దేశాల్లో ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా 9 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బాహుబలి 2 తరువాత ఇప్పుడు అజ్ఞాతవాసే రెండవ స్థానంలో ఉన్నాడు.

ఆక అదే స్థాయిలో ఇండియాలో కూడా పవన్ తన సత్తా చాటాడు. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ లో ఏమాత్రం తేడా రానివ్వకుండా ఊహించిన దానికంటే ఎక్కువగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఫైనల్ కాలేదు కానీ కొన్ని ప్రముక మీడియాల్లో వస్తోన్న లెక్కల ప్రకారం అజ్ఞాతవాసి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 60.5 కోట్ల గ్రాస్ తో సౌత్ లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు అని తెలుస్తోంది. ఇప్పటివరకు బాహుబలి 2 మాత్రమే మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత కబాలి ఉండగా మూడవస్థానంలో అజ్ఞాతవాసి నిలిచింది.