భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేనాని మరో ముందడుగు…

Wednesday, November 13th, 2019, 09:47:32 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా ఇసుక రవాణా విషయంలో అటు ప్రభుత్వానికి, ఇటు విపక్షాలకు మధ్యన తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రాష్ట్రంలోని విపక్షాలు అన్ని కూడా భవన నిర్మాణ కార్మికులకు అండగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈమేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల లాంగ్ మార్చ్ అనే ర్యాలీని నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. కాగా భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా జనసేనాని మరొక ముందడుగు వేశారు. ఈ నెల 15న మంగళగిరిలో పర్యటించి, భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ అన్నదాన పథకాన్ని ఆయన ప్రారంబించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన కొన్ని లక్షలాది మంది భావన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికీ పని లేక, సంపాదన లేక చాల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అంతేకాకుండా ఇప్పటికి కూడా పస్తులు ఉంటున్నారని సీఎం జగన్ పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే వారి ఆకలి బాధలు చూడలేక భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ అన్నదాన పథకాన్ని ప్రారంభిస్తున్నారు జనసేనాని. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడు వెనక్కి తగ్గి, కార్మికులందరికీ చేతి నిండా పని దొరుకుతుందో అప్పటి వరకు కూడా తన పోరాటాన్ని ఆపేది లేదని పవన్ స్పష్టం చేశారు.