పవన్ ఢిల్లీ టూర్ : పర్యటన అంతా గోప్యం

Sunday, November 17th, 2019, 03:00:34 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. కాగా పవన్ ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది చెప్పాలి. పవన్ ఢిల్లీ కి ఇంత సడన్ గా ఎందుకు వెళ్లారు అనే ప్రశ్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మదిలో వెలిగింది. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా ముగిసిందని చెప్పాలి. కాగా అయితే ఏపీ అధికార వైసీపీ పార్టీ మీద ఢిల్లీ పెద్ద నేతలకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడని కొందరు, రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులపై సీఎం జగన్ ప్రవర్తిస్తున్న తీరు వివరించడానికి వెళ్లాడని కొందరు చర్చించుకున్నారు.

అయితే అలాంటివేమీ జరగలేదని సమాచారం. కానీ పవన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారనేది మాత్రం ఇప్పటికి కూడా ఎవరికీ తెలియడం లేదని చెప్పాలి. ఇకపోతే పవన్ పర్యటన కోసం జనసేన పార్టీ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆయన ఢిల్లీకి బయలుదేరినప్పటినుండి, తిరిగి రాష్ట్రానికి వచ్చే వరకు కూడా అంత గోయంగానే ఉంచారు జనసేన పార్టీ నేతలు. కానీ తన పర్యటన కోసం పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, తన పర్యటన కోసం, తదితర అంశాల కోసం వెల్లడించనున్నారని సమాచారం.