దెబ్బకు దెబ్బ తీస్తానంటున్న పవన్ కళ్యాణ్ – ఎవరి మీద కోపం…?

Sunday, June 9th, 2019, 04:28:39 PM IST

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి పాలవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు… కాగా భీమవరంలో తనని ఓడించడానికి ప్రత్యర్ధులు 150కోట్లు ఖర్చు చేశారని పవన్ చేసిన వాఖ్యలు ఇప్పుడు కాస్త దుమారాన్ని లేపుతున్నాయి… ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయం అనంతరం జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు… ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు తెలుసుకుంటూ భవిష్యతి కార్యాచరణకు ముందుకెళ్తున్నారు… అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు రచిస్తున్నారు.

అయితే రాయలసీమ జిల్లా నేతలు మరియు ఎన్నారై విభాగానికి చెందిన నేతలతో పవన్ భేటీ అయ్యారు. అక్కడ మాట్లాడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వేసే కొత్త వ్యూహాలు ఎలా ఉంటాయో చూపిస్తా, దెబ్బకు దెబ్బ తీస్తా అంటూ పవన్ కళ్యాణ్ ఘాటైన వాఖ్యలు చేశారు. అంతేకాకుండా మన రాజకీయాల్లో మార్పు వచ్చేంత వారు కూడా రాజకీయ ఎత్తుగడలు వేస్తానని, శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగేవరకు కూడా ఈ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తానని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తానూ ఏమి ఆశించకుండా రాజకీయాల్లోకి వచ్చానని, తన పని తానూ చేసుకుంటూ పోతున్నానని, చప్పట్లు కొట్టిన, తిట్టినా, మెచ్చుకున్నా, ఎవరెన్ని చేసిన కూడా తానూ ముందుకు వెళ్తానని, ఎందుకంటే ఇది నా దేశం, నా సమాజం అని పవన్ అన్నారు. కాగా నిజమైన రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు వేయలేక కాదు, ఈసారి అన్ని చేసి చూపిస్తానని పవన్ స్పష్టం చేశారు.