పవన్ సంచలన నిర్ణయం : భవన నిర్మాణ కార్మికులకు రెండు రోజులు ఆహార శిబిరాలు ఏర్పాటు

Saturday, November 9th, 2019, 02:20:00 AM IST

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దీ రోజులుగా ఇసుక రవాణా ఆగిపోవడం వలన కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయి కార్మికుల కుటుంబాలు అన్ని కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాఖ్యానించారు. కాగా ఇలాంటి పరిస్థితుల్లో వారందరుకి కూడా కాస్త ఊరట కలిగించే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా డొక్కా సీతమ్మ పేరుతో ఆహార శిబిరాలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. కాగా ఈనెల ఈనెల 15, 16 తేదీల్లో ఆహార శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.

ఈంరకు మాట్లాడిన పవన్ కళ్యాణ్… “పనుల కోసం అడ్డాకు కార్మికులు వచ్చే సమయంలో – అడ్డాల దగ్గరే శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తాం.. మా వనరులు పరిమితమేగావచ్చు. కానీ మనకు చేతనైనంత సాయం చేస్తాం”… అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ శిబిరాలు ప్రబుత్వాన్నికదిలించాలని, కనీసం ఇలాగైనా ప్రభుత్వం దిగి వస్తుందేమో చూడాలి అని పవన్ తెలిపారు. అంతేకాకుండా ఈ పథకానికి ఏ పేరైన పెట్టుకోండి, ఎలాంటి రంగైనా కూడా వేసుకోండి కానీ కార్మికులకు ఉచితంగా ఆహారాన్ని ప్రభుత్వం తరపున అందించే ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.