ప్రజలకు అండగా జనసేన – తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్

Saturday, June 8th, 2019, 03:30:10 AM IST

ఎన్నికల్లో జరిగినటువంటి ఓటమి, పరాజయం లాంటి వాటితో నమ్మకం లేకుండా ప్రజలతో మమేకం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా తమ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటూ శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జనసేన తరపున పోటీచేసిన అభ్యర్థులతో శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. జాసేన పార్టీ ఎన్నికలకోసం కాదని ప్రజలకొరకు స్థాపించిన పార్టీ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాకుండా ఇతర పార్టీలతో పోల్చుకుంటే జనసేనకు ఉన్న వనరులు పరిమిత మని, జనసేనాని నమ్మిన వారే తమకు అండగా ఉంటారని పవన్ స్పష్టం చేశారు. కాగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎదురైన అనుభవంతో ముందుకెళ్లాలని, ఈ ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికివారు స్వీయ పరిశీలన చేసుకోవాలని అభ్యర్థులకు పవన్‌ దిశానిర్దేశం చేశారు.

కాగా ఏపీలో తొందరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు అందరు కూడా సిద్ధమవ్వాలని ఓవెన్ తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రస్థాయి కమిటీ చేర్పాటు చేస్తామన్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు వచ్చినా పార్టీ కోసం నిలబడ్డవారిని గుర్తించి, వారికి సహాయ సహకారాలను అందించాలని తెలిపారు.