అతడి తెలుగు మాటలకు ఫిదా అయిన పవన్ – కానీ అతడు విదేశీయుడు…

Thursday, November 21st, 2019, 02:00:37 AM IST

ఆంద్రప్రదేశ్ లో గత కొద్దీ రోజులుగా ఇంగ్లీష్ మీడియం అనే అంశం పై తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. సీఎం జగన్ రాష్ట్రంలోని పిల్లలకు ప్రత్యేకంగా వారి వారి ప్రభుత్వ పాఠశాలల్లో అందరికి తెలుగు మీడియం చదువులకు బదులుగా ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రవేశ పెట్టాలని, దానికి ఎవరైనా అడ్డు చెబితే చట్టపరమైన చర్యలు షసుకోడానికి కూడా వెనుకాడేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాలం ఈ విషయంలో రాష్ట్రంలోని విపక్షాలు అన్ని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. అంతేకాకుండా తెలుగు భాషను చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈమేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక వీడియో ని పోస్ట్ చేశారు. దానికి తోడు మన నుడి-మన నది అని ఒక కొత్త నినాదాన్ని ప్రకటించారు. కాగా కాగా తెలుగు భాష పరిరక్షణకు అందరం కూడా కలిసి పోరాడదామని పవన్ ప్రజలందరికి కూడా పిలుపునిచ్చారు. కాగా పవన్ పోస్ట్ చేసిన ఆ వీడియో లో ఒక విదేశీయుడు తెలుగును చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆ విదేశీ యువకుడు తెలుగు బాష కోసమని ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా నడుపుతున్నాడు. ఆ విదేశీయుడి తెలుగు బాష కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిదా అయిపోయాడు.