వైసీపీపై సంచలన వాఖ్యలు చేసిన జనసేనాని – ఏమన్నారంటే…?

Monday, May 25th, 2020, 11:50:36 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైసీపీ పార్టీపై పలు సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా నేడు పవన్ కళ్యాణ్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా వైసీపీ ప్రభుత్వం పై పెట్టిన పోస్టు ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. కాగా ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీ కి సంబందించిన భూములని అమ్మడానికి అధికార వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వాఖ్యలు చేశారని సమాచారం. అంతేకాకుండా టీటీడీ భూములని తీసేయడానికి కూడా ఎలాంటి అవకాశాలు లేవని, దాంట్లో న్యాయపరమైన అంశాలు కూడా ఉన్నాయని పవన్ కళ్యాణ్ వాఖ్యానించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా పలు వాఖ్యలు చేశారు.

కాగా “భక్తుడి మనోభావాలను, నమ్మకాన్ని దెబ్బతీయడం మరియు భవిష్యత్తులో రాష్ట్రానికి ఆర్థిక అవకాశాలను పణంగా పెట్టడం, వైసిపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులలో టిటిడిని భూములను అమ్మేందుకు అనుమతిస్తే అది చాలా పెద్ద తప్పు” అని పవన్ కళ్యాణ్ పోస్టు పెట్టారు.