సినీ కార్మికులకు అండగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన జనసేనాని

Wednesday, September 11th, 2019, 12:11:45 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు సినీ కార్మికుల కోసం మరొక ముందడుగు వేశారు. కాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి చిత్రపురి కాలనిలో ఇల్లు దక్కనటువంటి సినీ కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరింత స్థలం స్థలం కేటాయించాలని, ఆలా మరింత స్థలాన్ని కేటాయించడం వలన మరొక 30వేల మంది కార్మికులకు ప్రభుత్వం తరపున ఇల్లు కట్టించిన వారవుతారని పవన్‌కళ్యాణ్‌ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా మంగళవారం నాడు జనసేన కార్యాలయంలో తెలుగు సినీ వర్కర్స్‌ కోపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యవర్గ సభ్యులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సమావేశాన్ని నిర్వహించారు. కాగా అవసరమైతే ఈ మరింత స్థలానికి టీనా పార్టీ తరపున లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి ఒక లేఖను పంపిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇకపోతే సినీ కార్మికులు తమ ఇంటికి సంబందించిన కేటాయిపుల్లో కార్మికులు పడుతున్న అవస్థలు చూడలేక, పవన్ కళ్యాణ్ నేడు వారి ఇబందులను సమస్యలను అన్నింటిని వారి కమిటీ ముందుకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈమేరకు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “చిత్రపురి కాలనీ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరంగా పూర్తి చేసి, ఆతరువాత అక్కడ మిగిలి ఉన్నటువంటి 3 ఎకరాలలో ఎవరికైతే ఇళ్లులేని వారు ఉంటారో వారందరికీకూడా త్వరితగతిన ఇల్లు నిర్మించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దానికి సంబందించిన బాగ్యతలను అన్నింటిని కూడా పరుచూరి వెంకటేశ్వరరావు కి అప్పగించారు పవన్ కళ్యాణ్.