మామ అల్లుడు కలిసిపోయారు .. ఇక విభేదాలకు చెక్ పడ్డట్టే ?

Friday, April 20th, 2018, 03:08:35 PM IST

గత కొన్ని రోజులుగా మెగా హీరోల్లో విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయని, మెగా ఫాన్స్ కూడా రెండుగా చెలిపోయారని ప్రచారం జరిగింది. ఆ మధ్య అల్లు అర్జున్ ఓ వేడుకలో చెప్పను బ్రథర్ అని చెప్పిన డైలాగ్స్ మెగా ఫాన్స్ లో తీవ్ర కలకలం రేపింది. ఆ తరువాత ఏ వేడుకల్లోనూ పవన్ – బన్నీ కలవలేదు .. వీరిద్దరి మధ్య దూరం ఇంకా పెరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరు ఫిలిం ఛాంబర్ కి వచ్చారు. తాజాగా శ్రీ రెడ్డి వ్యవహారం పై పెద్ద దుమారమే రేగింది. పవన్ కళ్యాణ్ తల్లిని శ్రీ రెడ్డి తిట్టిందని ఈ విషయం పై పవన్, నాగబాబు లాయర్లతో చర్చిస్తున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వ్య్వవహారంలోకి దిగింది. వీరితో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు పూర్తిగా తమ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా పఅవఅవణ – అల్లు అర్జున్ ఇద్దరు కలిసిపోయారు .. బన్నీ ఎమోషనల్ గా పవన్ కళ్యాణ్ ను గట్టిగ వాటేసుకున్నాడు. సో మెగా హీరోల్లో ఎలాంటి విభేదాలు ఉండవని అనుకోవచ్చు. మరి శ్రీ రెడ్డు వ్యవహారం పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments