జగన్ “ముఖ్యమంత్రి” అని పవన్ ఒప్పుకోలేకపోతున్నారా?

Thursday, November 21st, 2019, 08:45:30 AM IST

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అతి త్వరలోనే జగన్ కి సమర్ధవంతమైన ప్రతి పక్ష నాయకుడిగా ఎదగ గలడు అని అనిపిస్తుంది. చంద్రబాబు ని అయితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని సంబోధించిన పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి ని మాత్రం వైసీపీ లీడర్ అని అనడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దానికి చాలానే కారణాలు వున్నాయి.

పవన్ కళ్యాణ్ ని మొదట నుండి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నది వైసీపీ అని చెప్పాలి. పవన్ మూడు పెళ్లిళ్లు అంటూ ప్రతి పక్షం లో వున్నపుడు జగనే సెలవిచ్చారు. తాజాగా ఇంగ్లీష్ మీడియం పై పవన్ గళమెత్తి గర్జిస్తుంటే మరొకసారి ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చే పవన్ కళ్యాణ్, ఈ ఒక్క విషయం లో జగన్ ని ఏ మాత్రం ముఖ్యమంత్రిగా స్వీకరించలేకపోవచ్చు. కేవలం ఒకే ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీ పై వైసీపీ నేతలు టీడీపీ ని కాకుండా జనసేన ని టార్గెట్ చేసారని చెప్పొచ్చు, దానికి కారణం పవన్ ప్రజాసేవలో నిమగ్నమవ్వడమే.