శ్రీ రెడ్డి వివాదంపై స్పందించిన పవన్

Saturday, April 14th, 2018, 02:43:49 PM IST

గత కొంత కాలంగా టాలీవుడ్ లో శ్రీ రెడ్డి వివాదం ఏ స్థాయిలో చెలరేగుతుందో అందరికి తెలిసిందే. కొంత మంది ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించారని కామెంట్స్ చేశారు. అయితే అలాంటి కామెంట్స్ కి పవన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రీసెంట్ గా మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. తాను స్పందించిన మాత్రాన సమస్య పరిష్కారం కాదని, తాను ఒక పోలీస్ – న్యాయవాధి కాదని చెప్పారు. ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే కోర్టుకు గాని పోలీస్ స్టేషన్ కి గాని వెళ్లాలని చెప్పారు. అంతే గాని మీడియా ముందుకు వెళితే న్యాయం జరగదు. ఎన్ని డిబేట్లు పెట్టినా కొన్ని రోజులకే అందరు మర్చిపోతారని చెప్పారు. ఇక అన్యాయానికి గురైన వారికి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని చెబుతూ.. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళితే బావుంటుందని సెన్సేషన్ కోసం కాకుండా న్యాయం కోసం పోరాటం చేయాలనీ ఆయన సమాధానం ఇచ్చారు.