ఈ సారి పవన్ కళ్యాణ్ టార్గెట్ మిస్ అవుతుందా?

Wednesday, December 11th, 2019, 08:42:01 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం ఫై ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమస్యల ఫై పోరాటం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇసుక కొరత ఫై పోరాటం చేసిన తీరుని చూసి అధికార పార్టీ వైసీపీ కాస్త ఆందోళన చెందినది అని చెప్పుకోవచ్చు.డొక్కా సీతమ్మ శిబిరాలతో పవన్ ఒకడుగు ముందుకు వేసి భవన నిర్మాణ కార్మికుల ఆకలిని తీర్చాడు. అయితే అనంతరం పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మాధ్యమం ఫై చేసిన వ్యాఖ్యలకు మిశ్రమ స్పందన వచ్చింది.

అయితే పవన్ కళ్యాణ్ ఇపుడు రైతు సౌభాగ్య దీక్ష చేపట్టడానికి సిద్ధంగా వున్నారు. చంద్రబాబు విషయం లో ఏ ఒక్క విమర్శ కూడా పవన్ చేయడం లేదు. కొన్ని విషయాలలో టీడీపీ ఇంకా పవన్ కి మద్దతు ఇస్తూనే వుంది. అయితే పవన్ రాయలసీమ పర్యటన, ఆంధ్ర పర్యటనలో కొన్ని విషయాలని అర్ధం చేసుకొని ఉంటారు. గత ప్రభుత్వ పాలన లోపాల్ని గుర్తు చేస్తూ, పంటల గిట్టు బాటు ధరలు, ఖర్చులు రాబట్టుకోలేని పరిస్థితి ఫై దీక్ష అని ప్రకటించారు. అయితే ఇప్పటికే జగన్ ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా-పీఎం యోజన పథకం తో రూ. 13,500 ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం ఈ మాత్రం సహాయాన్ని కూడా అందించలేదు. మరి పవన్ కళ్యాణ్ ఈ విషయాల్ని గుర్తు చేసుకోకుండా జగన్ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తే పవన్ ఫై ప్రజల్లో వ్యతిరేకత భావం ఏర్పడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.