బిగ్ బ్రేకింగ్: జనసేన చేసిన అతి పెద్ద తప్పు ఇదేనా..!

Monday, June 17th, 2019, 12:00:03 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో ప్రధానంగ మూడు పార్టీలు బరిలో ఉన్నా గెలుపు మాత్రం వైసీపీనే వరించింది. అధికారంలో ఉన్న టీడీపీ కూడా వైసీపీఎ ఫ్యాన్ గాలి స్పీడ్‌లో కొట్టుకుపఒయింది. ఇక ఈ సారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి వచ్చిన జనసేన మాత్రం కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా పడిపోయాడంటే జనసేనకు ఎంత నష్టం చేకూరిందే అర్ధమవుతుంది.

అయితే పవన్ కళ్యాణ్‌పై ముందు నుంచి పెద్దగా అంచనాలు లేకపోయినా, తన ప్రసంగాలు, ఎన్నికల ముందు జనసైనికులు చేసిన హడావుడిని చూసిన వారంతా జనసేన తప్పకుండా ఐదు, లేదా ఆరు స్థానాలు గెలుచుకుంటుందని అనుకున్నారు. అయితే ఫలితాలలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. కేవలం ఒక్క సీట్‌ని మాత్రమే గెలుచుకుని అధినేత పవన్ కూడా ఓడిపోయాడు. అయితే జనసేన మరీ ఇంతాలా ఓడిపోవడానికి వైసీపీ ప్రభావం బాగా కనిపించడం కారణమైతే, జనసేన కేవలం సోషల్ మీడియా పైన ఆధార పడడం మరొక కారణం. అయితే ముందు నుంచి సోసహ్ల్ మీడియాను బాగా వాడుకుని సోషల్ మీడియాలో పాప్‌లర్ అయ్యారే తప్పా ప్రజలతో స్వయంగా తిరిగి వారితో కలవలేకపోయారు పవన్. పెద్ద పెద్ద సభలు నిర్వహించి పవన్ అందులో ఎంతో గొప్పగా ప్రసంగాలు ఇచ్చినా అది జనసేన గెలుపుపై పెద్ద ప్రభావం చూపలేదు. సభలకు వచ్చిన జనమంతా పవన్‌ని ఒక హీరోగా చూడడానికి వచ్చారే తప్పా జనసేన పార్టీ కోసం వచ్చిన వారు చాలా తక్కువ.

ఇది ఇలా ఉంటే పవన్ సోషల్ మీడియాను వాడినట్టు మరే జాతీయ పార్టీ కూడా వాడి ఉండదు. అయితే సోషల్ మీడియాను ఇంత వాడిన పవన్ మీడియాను మాత్రం పూర్తిగా పక్కకు పెట్టాడని ఒకవేళ మీడియాని కనుక కాస్త వాడి ఉంటే జనసేనకు మంచి ఫలితాలే వచ్చి ఉండేవని కొన్నిరాజకీయవర్గాలు చర్చంచుకుంటున్నాయట. అందుకే ఈ సారి ఒక సొంత మీడియాను పెట్టే యోచనలో పవన్ ఉన్నారు. అయితే జనసైనికులు కూడా ప్రచారంపై పెద్దగా దృష్టి సారించలేదని, ఏదో టికెట్ వచ్చింది చాలు అనే భ్రమలో ఉంటూ, ఫోటోలకే ఎక్కువ ఫోజ్‌లిచ్చారు అంటూ దానిపై జనసైనికులు కూడా కాస్త నిరాశకు లోనయ్యారట. అయితే ఇవన్ని తెలుసుకుని వచ్చే ఎన్నికలలో అయిన పవన్ ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకుంటే బావుంటుందని, అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారట.