కత్తి మహేష్ కి కత్తి దింపాల్సిందే… ఆగ్రహంతో ఊగిపోతున్న పవన్ ఫాన్స్

Thursday, December 5th, 2019, 06:27:12 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరొకసారి కత్తి మహేష్ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. నిత్యం పవన్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ, సోషల్ మిడియా లో కూడా పవన్ పై సంచలన పోస్టులు పెట్టె కత్తి మహేష్ తాజాగా మరొకసారి పవన్ ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కాగా ప్రస్తుతానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా పావకం కళ్యాణ్, సీఎం జగన్ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. ఇప్పుడనే కాదు గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్, సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ ఒకరకమైన పోరాటాన్ని చేస్తున్నాడని చెప్పాలి.

అయితే తాజా ఆర్యటనలో కూడా సీఎం జగన్ పై పవన్ విమర్శలు చేసిన తరుణంలో, పవన్ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కత్తి మహేష్ కూడా పవన్ పై విరుచుకుపడుతున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఈ మధ్యన జోకులు బాగా వేస్తున్నాడు. జగన్ పాలన ని, హైదరాబాద్ లో జరిగిన ఘటనతో ముడిపెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉందని కత్తి మహేష్ విమర్శించారు. ఈమేరకు మాట్లాడిన కత్తి మహేష్… “మాతృభాషకి దిశ రేప్‌కి లింకేందిరా నాయనా.. వామ్మో. వాయ్యో.. ఈ సోదిగాడికి పిచ్చి పట్టిందిరో” అంటూ ఫేస్ బుక్‌ వేదిక ద్వారా పోస్టు చేశాడు కత్తి మహేష్. అయితే కత్తి మహేష్ వాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ అభిమానులు కత్తి మహేష్ కి కట్టి దింపుతామంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.