అంతా రెడీ.. అయినా పవన్ ఫాన్స్ కు నిరాశే..!

Wednesday, September 27th, 2017, 12:55:30 PM IST


పవన్ కళ్యాణ్ సినిమాకి సంబందించిన విశేషం బయటకు వస్తేనే పండగ చేసుకునే అభిమానులు ఉంటారు. అలాంటి త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంపై ఎలాంటి ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మ్యూజిక్ బిట్ మినహా ఈ చిత్రం అభిమానులను ఉత్సాహపరిచే త్రివిక్రమ్ మరేం విడుదల చేయలేదు. షూటింగ్ ప్రారంభమై చాలారోజులు పూర్తయింది. బిజినెస్ కూడా ఆల్మోస్ట్ పూర్తయింది. అయినా ఇంత వరకు టైటిల్ కంఫర్మ్ కాలేదు. ఈ చిత్రానికి సంబందించిన వర్క్ అంతా ప్లానింగ్ ప్రకారం పక్కాగా జరుగుతోంది. కానీ కేవలం టైటిల్ విషయంలోనే త్రివిక్రమ్ కన్విన్స్ కాలేకపోతున్నారట.

రకరకాల టైటిల్స్ ని పరిశీలిస్తున్నా నిర్ణయానికి రాలేకున్నారు. కథకు పక్కాగా సరిపోయే టైటిల్ నే ఫిక్స్ చేయలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుండడంతో ఫస్ట్ లుక్ విడుదల జాప్యానికి కారణం అవుతోంది. వాస్తవానికి దసరాకే ఫస్ట్ లుక్ విడుదల చేయాలని భావించారట. కానీ టైటిల్ ఫైనలైజ్ కాకపోవడంతో మరో మారు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. మరో మారు పవన్ ఫాన్స్ కు నిరాశే ఎదురైంది.

  •  
  •  
  •  
  •  

Comments