పవన్ నిర్ణయానికి అభిమానులు హ్యాపీయేనా?

Wednesday, January 15th, 2020, 02:40:24 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అక్కడి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తో చర్చించిన పవన్ కళ్యాణ్, వచ్చే ఎన్నికలకు బీజేపీ తో కలిసి పనిచేయనున్నారని సమాచారం. అయితే ఈ నెల 16 వ తేదీన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం ఫై పవన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా భవిష్యత్లో మాత్రం జనసేనకు లాభదాయకం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ జనసేన పార్టీ పెట్టినపుడు ఉన్నటువంటి ఆలోచనలు ఇపుడు ఏమయ్యాయో అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. బీజేపీ ఫై కూడా తీవ్ర విమర్శలు చేసిన పవన్, అదే బీజేపీ తో కలిసి పని చేయడం పట్ల అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం అలా ఉంచితే ఎన్నికల్లో పాచిపోయిన రెండు లడ్డులను ఇచ్చింది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఏమయ్యాయి అంటూ పవన్ కి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.