పిస్తోల్ తో కాల్చుకొని చనిపోవాలనుకున్న పవన్ సంచలన వ్యాఖ్యలు

Wednesday, August 21st, 2019, 10:40:18 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు జరిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకి స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలెబ్రిట్ చేసిన తర్వాత మాట్లాడుతూ, తెలంగాణలో మొన్నటి ఇంటర్ ఫలితాల సమయంలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవటం జరిగింది. వాటిని చూసి నా మనస్సు చలించిపోయింది. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.

నేను ఇంటర్ తప్పినప్పుడు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో ఏమి చేయాలో నాకు అర్ధం కాలేదు. అన్నయ్యకి లైసెన్సుడ్ పిస్టల్ ఉండేది, దానితో కాల్చుకొని చనిపోవాలని అనుకున్నాను, ఆ సమయంలో నా పరిస్థితి చూసి నాగబాబు అన్నయ్య, వదిన నన్ను చిరంజీవి అన్నయ్య దగ్గరకి తీసుకోని వెళ్లారు. “నువ్వు ముందు బ్రతకాలిరా బాబు.. ఇంటర్మీడియట్ పెద్ద విషయం కాదు నాకు, నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయినా కానీ నువ్వు మనిషిగా ఉండాలి. ఇలా కాకపోతే ఇంకోలా చదువుకో కానీ ఇలా డిప్రెషన్ కి గురికావ్వదు” అంటూ నాకు చెప్పాడు .

ఆ రోజు అన్నయ్య చెప్పిన మాటలు నాకు కొండంత ఊపిరిని ఇచ్చాయి. అలాంటిది మొన్న ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల ఇంట్లో కూడా అన్నయ్య లాంటి వ్యక్తి ఉండి, దైర్యం చెపితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అలాగే తన జీవితంలో చిరంజీవి ఇచ్చిన అమూల్యమైన సలహాల వలనే తాను ఇలా ఈ స్టేజి మీద ఉన్నానని చెప్పాడు