పవన్ కళ్యాణ్ .. చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ !

Sunday, November 27th, 2016, 12:50:49 PM IST

pawan-kalyan
మోడీ పెద్ద నోట్ల రద్దు విషయం లో నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల తరవాత స్పందించిన జన సేన అధ్యక్షుడు, తెలుగు హీరో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మోడీ నిర్ణయం మంచిదో చెడ్డదో మాట్లాడకుండా దాని వలన ఎంతో మంది నరకం అనుభవిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సాక్షిగా విమర్శలు చేసాడు. ఒకప్పుడు మోడీ తో కలిసి తిరిగి బీజేపీ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన హీరో పవన్ కళ్యాణ్ సడన్ గా కొన్ని నెలల నుంచీ బీజేపీ కి దూరంగా ఉంటున్నాడు. కళ్యాణ్ కీ తమకీ కూడా తెగిపోయింది అని పవన్ కళ్యాణ్ విషయం లో బీజేపీ కూడా తేల్చి పారేసింది. సోషల్ మీడియా లో తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు అందరూ అనే వాదన కి బలం ఇస్తూ పవన్ సామాన్యుల వాదన అర్ధం చేసుకోకుండా మాట్లదేసాడు అనే విమర్శలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. విపక్షాలు చెబుతున్నట్లుగా నోట్ల వ్యతిరేకత మీద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయంపై పవన్ కు అందిన ఫీడ్ బ్యాక్ తప్పన్న వాదన వినిపిస్తోంది. దేశంలో అత్యధికులు రద్దు నిర్ణయాన్ని ఇప్పటికి సమర్థిస్తున్నారు. అయితే.. రద్దు కారణంగా ఏటీఎంలు పని చేయకపోవటం.. బ్యాంకుల దగ్గర క్యూలు వారికిచిరాకు పుట్టిస్తున్నాయి. అయితే..ఈ చిరాకు.. అసహనం అంతా తాత్కాలికమే తప్పించి.. శాశ్వితం కాదన్న విషయాన్ని పవన్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. తమ అవసరాలకు సరిపడా డబ్బు దొరకలేదన్న ఆగ్రహం ఎవరికైనా మామూలే. కానీ.. చేతిలోకి డబ్బు అందిన తర్వాత.. సామాన్యుడు సైతం మోడీ నిర్ణయాన్ని.. ఆయన ప్రదర్శించిన ధైర్యాన్ని అభినందిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు.