పవన్ మాట మారుస్తున్నాడా? అభిమానులను ఖుషి చేయనున్నాడా?

Thursday, October 17th, 2019, 01:28:26 PM IST

జనసేన అధినేతగా వున్న పవన్ కళ్యాణ్ సినిమాల పై దృష్టి పెట్టినట్లు వార్తలు సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ పింక్ చిత్రం రీమేక్ లో నటించడానికి ఒప్పుకున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తమిళం లో ఇప్పటికే అజిత్ ఇదే పింక్ చిత్రాన్ని రీమేక్ చేసి ఘన విజయాన్ని అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం. అంతేకాకుండా సహా నిర్మాతగా బోనికపూర్ ఉండనున్నట్లు సమాచారం.

వేదం క్రిష్ ఎన్నో సంచలనాత్మక చిత్రాలు తీసి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు ద్వారా ప్లాపులని అందించాడు. క్రిష్ పవన్ కి తగ్గట్లుగా ఒక కథని రాసుకొని వచ్చారని తెలుస్తుంది. పవన్ కథ విని ఈ చిత్రం లో నటిస్తానని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే పింక్ చిత్రం తదుపరి ఈ చిత్రాల్లో నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రజా సేవలో నిమగ్నమై వున్నారు. పవన్ తన అభిమానుల కోసం రాజకీయాల్లోనే ఉంటాను, సినిమాల్లో ఇక నటించను అని చెప్పిన మాటల్ని మారుస్తాడా? లేకపోతే అదే పంథాను కొనసాగిస్తాడో తెలియాల్సి వుంది. పవన్ కళ్యాణ్ పై ఇన్ని విషయాలు బయటికి వస్తున్నప్పటికీ పవన్ మాత్రం అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు.