పవన్ కళ్యాణ్, బండి సంజయ్‌ల భేటీ.. ఏం చర్చించారంటే..!

Tuesday, May 26th, 2020, 01:00:27 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని పవన్ వ్యక్తిగత కార్యాలయంలో సుమారు గంట పాటు వీరిద్దరి సమావేశం కొనసాగింది.

అయితే ఏపీలో బీజేపీతో జనసేన కలిసి పనిచేస్తున్న నేపధ్యంలో, తెలంగాణలో కూడా కలిసి పనిచేయాలని ఈ ఇద్దరు అభిప్రాయపడ్డారని అందుకే వీరి మధ్య భేటీ జరిగిందని సమాచారం. అయితే ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ పోతిరెడ్డి పాడు అంశంతో పాటు, టీటీడీ భూముల విక్రయ అంశంపై పవన్‌తో చర్చించినట్టు తెలిపారు. అయితే టీటీడీకి చెందిన భూములు విక్రయించడం సరికాదని, దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించాలని చూస్తున్నారని ఆరోపించారు.