పవన్ – దాసరిల సినిమాకు దర్శకుడు దొరికాడు?

Sunday, January 22nd, 2017, 09:00:35 PM IST

pawandasari
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. మార్చ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక గత ఏడాది క్రితం .. పవన్ కళ్యాణ్ తో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు సినిమా నిర్మిస్తాడని ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా రోజులు గడుస్తున్నా ఈ సినిమా పై ఎలాంటి ప్రకటన రావడం లేదు. పైగా దాసరి కూడా ఈ సినిమా కథ చర్చలు జరుగుతున్నాయని చెబుతూనే ఉన్నాడు .. ఫైనల్ గా ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందే సినిమాకు దర్శకుడు కుదిరాడు ? మీరు వింటున్నది నిజమే .. ఇంతకి ఆ దర్శకుడు ఎవరో తెలుసా .. శివ ? ఆ మధ్య గోపీచంద్ తో ‘శౌర్యం’ చిత్రాన్ని రూపొందించిన శివ ఈ మద్యే రవితేజ తో ‘దరువు’ , తమిళంలో అజిత్ హీరోగా ”వీరం” సినిమాలను రూపొందించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం ? పవన్ కళ్యాణ్ ఇప్పటికే ‘కాటమరాయుడు’ తరువాత నేసన్ దర్శకత్వంలో మరో సినిమా, అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇంకో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాల తరువాత పవన్ సినిమా ఉంటుందట !! త్వరలోనే అధికారిక వివరాలు ప్రకటిస్తారని తెలిసింది.