ఫిల్మ్ చాంబర్లో పవన్ నాగబాబు ఏం చేయబోతున్నారు..?

Friday, April 20th, 2018, 12:18:32 PM IST

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఖండిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మీడియా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాలపై పవన్‌.. తన న్యాయవాదులతో ఫిల్మ్‌ ఛాంబర్‌లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని మీడియా ఛానెళ్ల వ్యవహారశైలిపై నల్ల దుస్తులు ధరించి పవన్‌ నిరసన తెలిపారు. ఇక పవన్‌ వెంటనే సోదరుడు నాగబాబు, మా ప్రెసిడెంట్‌ శివాజీరాజా కూడా ఉన్నారు. అనూహ్యంగా అల్లు అర్జున్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో పవన్‌ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ట్వీటర్‌ వేదికగా పవన్‌ గత రాత్రి నుంచి సంచలన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్‌ అభిమానులు భారీగా ఫిల్మ్‌ ఛాంబర్‌కు చేరుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments