పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి కలిసి పని చేయనున్నారా …?

Tuesday, September 17th, 2019, 12:41:17 AM IST

నల్లమల్ల అడవుల్లో జరగబోయే యూరేనియం తవ్వకాల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలవుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ విషయంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వానికి పలు డిమాండ్స్ కూడా తెలిపారు. కాగా అయితే యురేనియం తవ్వకాల కోసమని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో నేడు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కానీ ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా అక్కడ పవన్ ని మరియు రేవంత్ ని చూస్తూ ఉండిపోయారు. కాగా యురేనియం తవ్వకాల కోసమని వీరిద్దరు కలిసిపోనున్నారని సమాచారం.

కాగా ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి తో కలిసి ఉద్యమం చేస్తే రాజకీయంగా తన ఉనికిని చాటుకోడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇకపోతే రాజకీయంగా బలపడటానికి పవన్ కళ్యాణ్ ఇలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో బలంగా పోరాటం చేస్తే తెలంగాణలోకూడా బలపడే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కానీ ఈ ఉద్యమంలో వీరిద్దరూ కూడా చివరి వరకు కలిసి పని చేస్తారా, లేదా అనేది చరచనీయంశంగా మారింది.