టీడీపీ మద్ధతు కోరిన పవన్ కళ్యాణ్.. షాక్‌లో వైసీపీ..!

Monday, October 28th, 2019, 10:47:29 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ విధానం ఆలస్యం కావడం, తీవ్ర ఇసుక కొరత ఏర్పడం జరిగింది. అయితే ఇసుక కొరత వలన భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏర్పడిన ఇసుక కొరత నిరసనకు గాను జనసేన నవంబర్ 3న విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాము చేపడుతున్న ఈ నిరసన ప్రదర్శనకు పరోక్షంగా టీడీపీ మద్ధతు కోరారు పవన్ కళ్యాణ్. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం కారణంగా రాష్ట్రంలో 35లక్షల భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయితే ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, కార్మికులకు మద్ధతుగా చేపట్టిన లాంగ్ మార్చ్‌కు అన్ని పార్టీల మద్ధతు కావాలని కోరారు. అయితే ఇప్పటికే బీజేపీ, కమ్యూనిస్టు వంటి పార్టీలు తమకు మద్ధతు తెలుపుతున్నాయని, మిగతా పార్టీల వారి మద్ధతు కూడా కావాలని పరోక్షంగా ఏ పార్టీ పేరు ప్రస్తావించకుండా కోరారు. అయితే ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇసుక సమస్యపై తీవ్ర పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో జనసేన తలపెట్టిన నవంబర్ 3 లాంగ్ మార్చ్‌కు తమ మద్ధతు కూడా ప్రకటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే అన్ని పార్టీలు మద్ధతు తెలిపీతే జనసేన తలపెట్టిన ఈ కార్యక్రమం ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.