డెడ్ లైన్ పెట్టిన పవన్ కళ్యాణ్..?

Friday, October 20th, 2017, 11:55:33 PM IST

పవన్ ఓ వైపు తన 25 వ చిత్రంలో నటిస్తూనే మరో వైపు జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మొదట ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ లోనే పూర్తవుతుందని భావించిన పవన్ అదే నెలలో జనసేనని బలోపేతం చేసేందుకు అదే నెలనుంచి ప్రజల్లోకి వెళ్లాలని భావించారు. కానీ పవన్ – త్రివిక్రమ్ ల చిత్ర షూటింగ్ ఆలస్యమైంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఫారెన్ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ లో ఈ షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఈ షెడ్యూల్ ఎట్టి పరిస్థితుల్లో డిలే కాకుండా త్రివిక్రమ్ కు పవన్ డెడ్ లైన్ విధించినట్లు వార్తలు వస్తున్నాయి.

నవంబర్ 25 నాటికి షూటింగ్ పూర్తి చేస్తే తాను రాజకీయ కార్యక్రమాల్లో బిజీ అవుతానని పవన్ త్రివిక్రమ్ తో అన్నారట. పవన్ కోరిన విధంగానే నవంబర్ 25 నాటికీ షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ లో ఆడియో, జనవరిలో సినిమాని విడుదల చేయడానికి త్రివిక్రమ్ అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.