ప‌వ‌న్ దంప‌తులు ర‌ష్యా వెకేష‌న్ పూర్తి

Thursday, May 10th, 2018, 04:09:05 PM IST

జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ర‌ష్యా వెకేష‌న్ దిగ్విజ‌యంగా పూర్త‌యింది. ఆరు రోజుల పాటు భార్య అన్నా లెజినోవా, పిల్ల‌ల‌తో క‌లిసి ఆయ‌న ర‌ష్యాలో విహార‌యాత్ర‌ను సాగించారు. రాజ‌కీయాల్లో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న ప‌వ‌న్‌కి ఇదో రిలాక్సేషన్ ట్రిప్ అనే చెప్పాలి. ఈ ప‌ర్య‌టన వేళ ప‌వ‌న్ ఎక్క‌డ ఆతిథ్య ం అందుకున్నారు? అంటే త‌న ర‌ష్య‌న్ బావ‌మ‌రుదుల ఇంట ఆతిధ్య ం అందుకున్నార‌ని తెలుస్తోంది. అల్లుడిని ర‌ష్య‌న్లు ఎంతో ప్రేమ‌గానూ చూసుకున్నార‌ట‌. ఇక ఈ ప‌ర్య‌ట‌న ముగించుకుని, బుధ‌వారం రాత్రి కుటుంబ స‌మేతంగా ప‌వ‌న్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టారు. ఆ మేర‌కు ప‌వ‌న్ ఫ్యామిలీ ఫోటోలు అంత‌ర్జాలంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప‌ర్య‌ట‌న ముగిసింది కాబ‌ట్టి.. ఇక‌మీద‌ట మ‌ళ్లీ రెగ్యుల‌ర్ పొలిటిక‌ల్ యాక్టివిటీస్‌కి ప‌వ‌న్ స‌న్నాహకాల్లో ఉన్నారు. జ‌న‌సేన పార్టీ ప్ర‌చారంలో భాగంగా జూన్-జూలైలో 40 రోజుల బ‌స్ యాత్ర సాగించ‌నున్నారు. ఈ బ‌స్ యాత్ర‌లో చాలా చోట్ల జ‌నాల‌తో ప‌వన్ నేరుగా ఇంట‌రాక్ట్ కానున్నారు.

Comments